పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జీనవాండ్లపల్లిలో గల నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం వద్ద ఈనెల 18వ తేదీన శివాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే నాయి బ్రాహ్మణ విజయభేరీ సభకు హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కె. పార్థసారథిని నాయి బ్రాహ్మణలు ఆహ్వానించారు. మంగళవారం అనంతపురం పట్టణంలోని ఎంపీ స్వగృహంలో బి. కె. పార్థసారథి తరపున అయన అల్లుడు శశిభూషన్ కు ఆహ్వాన పత్రం అందజేశారు.