పెనుకొండ పరిధిలో గోరంట్ల వినాయక్ నగరంలో మంత్రి సవిత ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు శుక్రవారం నూతనంగా బోరు ఏర్పాటు చేశారు. దీంతో వినాయక నగర్ వాసులు, గోరంట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి, మండల టీడీపీ నాయకులు నిమ్మల శ్రీధర్, మాజీ సర్పంచ్ నరేశ్ పాల్గొన్నారు.