ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని దర్గా పేటలో లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కరోజు ముందే పెన్షన్ అందించడం జరుగుతోందన్నారు.