పెనుకొండ: తల్లికి వందనం అమలుతో తల్లిదండ్రుల్లో ఆనందం.. మంత్రి

66చూసినవారు
తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని మంత్రి ఎస్. సవి తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.

సంబంధిత పోస్ట్