శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈనెల 31వ తేదీ వరకు పెనుకొండ మండలంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఐ మాట్లాడుతూ ఎవ్వరు కూడా అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, సభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రజా శాంతికి భంగం కలిగించకూడదన్నారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే పెనుకొండ డిఎస్పీకి 48 గంటల ముందు అనుమతి కొరకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని తెలిపారు.