పెనుకొండ: ఈ నెల 8 నుండి రెవెన్యూ గ్రామసభలు ఆర్డీఓ ఆనందకుమార్

75చూసినవారు
పెనుకొండ: ఈ నెల 8 నుండి రెవెన్యూ గ్రామసభలు ఆర్డీఓ ఆనందకుమార్
పెనుకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో ఈనెల 8వతేదీ నుండి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని గురువారం పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ గ్రామసభలలో ఆయా గ్రామాలలోని ప్రజలు, రైతులకు నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామస భలలో తమ సమస్యలను ఆర్జీలు ద్వారా తెలియజేయాలని, గ్రామసభలో పాల్గొనే అధికారులు సాధ్యమైనంతవరకు రైతుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేదిశగా చూడాలన్నారు.