గార్లదిన్నె మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలిచ్చామన్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు.