పెనుగొండ: ఘనంగా సావిత్రిబాయీ పూలే జయంతి

73చూసినవారు
పెనుగొండ: ఘనంగా సావిత్రిబాయీ పూలే జయంతి
సామాజిక సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయీ పూలే జయంతి సందర్భంగా అమరావతిలో శుక్రవారం ఆమె చిత్రపటానికి మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి తొలి బాలిక పాఠశాలను ప్రారంభించిన మహిళా విద్యావేత్త సావిత్రిబాయీ పూలే అని కొనియాడారు. అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం కృషి చేశారని, స్త్రీల హక్కుల కోసం పోరాడిన ధీశాలని అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్