పెనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 పి4మోడల్ విజన్ లో భాగంగా ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలనే సంకల్పంతో ఎంఎస్ఎంఈ, సీడ్ ఏపీ వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏర్పాటు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్టును పెనుకొండ మండలంలో విజయవంతం చేయాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్, అగ్రికల్చర్ ఎఓ చందన, కూటమి నాయకులు పాల్గొన్నారు.