పెనుకొండను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి

672చూసినవారు
పెనుకొండను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి
పెనుకొండ పట్టణం లోని అంబేద్కర్ సర్కిల్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్థంతి సందర్భంగా వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పెనుకొండను జిల్లాకేంద్రంగా ప్రకటించాలనే నినాదాలతో, హిందూ పురం పార్లమెంటరీ అధికారిక కేంద్రంగా కొనసాగుతున్న పెనుకొండ నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ,లేని పక్షంలో పెద్ద ఎత్తున వివిధ ప్రజాసంఘాల జెఎసి ఏర్పాటు చేసి పోరాటాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, వెంకటేశులు, సాయి ప్రసాద్, సుబ్రహ్మణ్యం,రవూప్,దండోరా రామాంజి, గంగాధర్,బాబయ్య,పెద్దన్న తదితర ప్రజా సంఘాలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్