పెనుకొండ పట్టణ సమీపంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం ఎస్ ఐ వెంకటేశ్వర్లు వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ ద్విచక్రవాహనాలు నడిపే టప్పడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతి వేగం వల్ల వచ్చే నష్టాలు, డ్రంకెన్ డ్రైవ్ గురించి, తదితర విషయాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.