పెనుకొండ: 'చారల పిల్లి 'పుస్తకం పరిచయ సభ

52చూసినవారు
పెనుకొండ: 'చారల పిల్లి 'పుస్తకం పరిచయ సభ
పెనుకొండ పట్టణంలోని యం. క్యూ. ఏ గ్లోబల్ ట్రస్ట్ లో శుక్రవారం సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కోగిర జయచంద్ర ఆధ్యక్షతన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. వేంపల్లె షరీఫ్ రచించిన 'చారల పిల్లి' పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా, యోగ గురువు రవిశంకర్ గురూజీ, మాజీసర్పంచ్ శ్రీనివాసులు, గ్రోబల్ ట్రస్ట్ అధ్యక్షులు కలీముల్లా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్