టీడీపీతోనే బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారని మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీసీ ఆత్మ గౌరవ భరోసా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్ తో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయ, సామాజిక స్వేచ్ఛా స్వాతంత్ర్య లభించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకతో బీసీలకు స్వర్ణయుగం మొదలైందన్నారు.