పెనుకొండ: ప్రమాద ఘటన చాలా బాధాకరం.. మంత్రి సవిత

58చూసినవారు
పెనుకొండ: ప్రమాద ఘటన చాలా బాధాకరం.. మంత్రి సవిత
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్