పెనుకొండ పట్టణంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో శుక్రవారం యుటీఎఫ్ పెనుకొండ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ సమక్షంలో మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, ఎం. సుధాకర్ చేతులు మీదుగా 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, కవిత, లత, యుటీఎఫ్ జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ హసీనా బేగం, సీనియర్ నాయకులు కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.