పెనుకొండ: నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి

83చూసినవారు
పెనుకొండ: నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి
నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్ది కోటి సదాశివం కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రూ1000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరించామన్నారు.

సంబంధిత పోస్ట్