కాపుల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని గత ప్రభుత్వం కాపులను పూర్తిగా విస్మరించిందని మంత్రి సవితమ్మ తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమందేపల్లి మండలానికి చెందిన బలిజ కులస్తులు మంత్రి సవితమ్మని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. కాపు భవనానికి స్థలంతో పాటు కోటి రూపాయల నిధులతో కాపు భవనం నిర్మిస్తామని అతి త్వరలోనే నిధులు కేటాయించి భవనం పూర్తి చేస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు.