కడప జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపడుతున్నామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా, పలు సమస్యలపైనా చర్చించామన్నారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిపైనా సమీక్షించినట్లు వివరించారు.