రొళ్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వీరాంజనేయులు ఆదివారం సూచించారు. తల్లికి వందనం డబ్బులు వచ్చాయా? చెక్ చేసి చెబుతాం OTP చెప్పండి అని ఎవరైనా ఫోన్ చేస్తే ఒక్క సమాచారం కూడా ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలు పెరిగాయని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయాలి లేక సచివాలయాన్ని సంప్రదించాలని కోరారు.