రాజధాని రైతుల అక్రమ సంకెళ్ళు పై నిరసన

347చూసినవారు
రాజధాని రైతుల అక్రమ సంకెళ్ళు పై నిరసన
రాజధాని అమరావతినే కొనసాగించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాజధాని గ్రామం కృష్ణాయపాలెం దళిత మరియు బి.సి. రైతులపై అక్రమముగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి దళిత, బి.సి సోదరులకు ఇనుప సంకెళ్ళు వేసి అత్యంత ఆమానవీయంగా తీవ్ర అవమానం చేసినందుకు నిరసనగా గురువారం పెనుగొండ మండల తహసీల్దార్ కార్యాలయం నందు పెనుకొండ మండల తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ పెనుకొండ మండల తాహ్శిల్దార్ కు ఆర్ ఐ సుబ్బారావు ద్వారా వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ శ్రీరాములు, పెనుకొండ పట్టణ అధ్యక్షులు హుజురుల్లాఖాన్, మండల తెలుగుయువత అధ్యక్షులు జావెద్, పార్టీనాయకులు సాయిప్రసాద్,ఖన్నాస్వామి,అత్తర్ ఖాదిర్ భాషా,అనిల్ కుమార్, మణికంఠ, వాసుదేవరెడ్డి, ఆండ్రూస్, హనుమంతరెడ్డి,హనుమన్న, శ్రీహరి, క్రిష్ఠ, మిలట్రీరామాంజినేయులు, గోనిపేటసుధాకర్,రామాంజి, వి.శ్రీరాములు తదితర టిడిపికార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్