పరిగి మండలం ధనాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించడం చాలా బాధాకర విషయం అన్నారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.