రొద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గత కొన్ని నెలలుగా నెలకొన్న త్రాగునీటి సమస్య మంత్రి సవిత చొరవతో శనివారం పరిష్కారం అయ్యింది. బీసీ కాలనీవాసులు త్రాగునీటి సమస్యను మంత్రి సవిత దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి వెంటనే బీసీ కాలనీలో బోరు వేయించి నీటి సమస్యను తీర్చారు. తాగునీటి నూతన బోరును మంత్రి సవిత ప్రారంభించడంతో బీసీ కాలనీవాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు