సోమందేపల్లి మండలం బుస్సయ్యగారిపల్లిలో గురువారం శానిటేషన్ పనులు చేపట్టారు. సర్పంచ్ అంజినాయక్ దగ్గరుండి కాలువలు, వాటర్ ట్యాంక్ దగ్గర, ఇళ్ల మధ్యలో శుభ్రం చేయించారు. అనంతరం గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామ ప్రజల క్షేమమే తనకు ముఖ్యమని, అందుకే ఈ శానిటేషన్ చేయించినట్లు అంజినాయక్ తెలిపారు. గ్రామస్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.