సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద గల కేజీబీవీ స్కూల్ లో విద్యార్థులు అస్వస్థకు కారకులైన వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి శేఖర్ కు నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనేక మార్లు అస్వస్థకు గురైన సంఘటనలు ఉన్నాయన్నారు.