సోమందేపల్లి మండలం కియా అనుబంధ సంస్థ (కెఈఎస్ఏఎం) కంపెనీలో 13 మంది బీహార్ కార్మికులతో పని చేయించుకొని జీతాలు రూ 1, 34, 340 ఇవ్వకుండా శ్రమ దోపిడి చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా సహాయకార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. బుధవారం అయన మాట్లాడుతూ జీతాలు అడిగినందుకు బీహార్ కార్మికుల పైన దౌర్జన్యం చేస్తున్న కాంట్రాక్టు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాలస్వామి, శీలా నారాయణస్వామి, బీహార్ కార్మికులు పాల్గొన్నారు.