సోమందేపల్లి: చికెన్, మటన్ వ్యర్థ పదార్థాలను తొలగించాలి

56చూసినవారు
సోమందేపల్లి: చికెన్, మటన్ వ్యర్థ పదార్థాలను తొలగించాలి
సోమందేపల్లి మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీ సమీపంలో చికెన్, మటన్ వ్యర్థ పదార్థాలను తొలగించి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు రక్షించి వృద్ధులు, పిల్లలను కుక్కల ప్రమాదాల నుండి భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మినారాయణ, మాజీ వార్డు మెంబెర్ వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్