సోమందేపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 3సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు స్థలంలో పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు హామీ అమలు చేయలేదన్నారు.