ఉపాధి కూలీ వేతనం పెంచి బడ్జెట్ లో నిధులు తగ్గించడం అంటే కూలీలను మోసం చేయడమే అని వ్యవసాయ మహిళా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామ ఉపాధి కూలీలు పని చేస్తున్న ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత అధ్యక్షతన రాష్ట్ర కన్వీనర్ నాగరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న పర్యటించి కూలీలతో పథకం అమలు, సమస్యలు తెలుసుకున్నారు.