సోమందేపల్లి: రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తన పంపిణీ

70చూసినవారు
సోమందేపల్లి: రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తన పంపిణీ
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని 10 గ్రామాల రైతులకు స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద గురువారం టీడీపీ నాయకులు వేరుశనగ విత్తన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించిన వేరుశనగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, టౌన్ కన్వీనర్ సురేష్ మాగే, చెరువు సర్పంచ్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్