సోమందేపల్లి చేనేత కులస్తులు శనివారం ధర్మవరంకు భారీగా వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్బంగా సోమందేపల్లి లోని శ్రీలక్ష్మివెంకటేశ్వర కళ్యాణమండపం వద్ద నుండి ధర్మవరంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు జరుగు సన్మాన కార్యక్రమానికి చేనేత కులస్థులు వాహనాల్లో తరలివెళ్లారు. కార్యక్రమంలో చేనేత కులస్తులు డి. సీ. ఈశ్వరయ్య, సీసీ హరి, డి. సీ. అశోక్, రంగనాయకులు, పూజారి ఈశ్వరయ్య, గూడూరు రమేష్, తదితరులు పాల్గొన్నారు.