మాట చెప్పి మొహం తిప్పిన ఘనత జగన్ ది అని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం సోమందేపల్లి మండలం మాగే చెరువు లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.