సోమందేపల్లి మండలం కదిరే పల్లి వద్ద గల శ్రీలక్ష్మినరసింహ స్వామిని ఏకాదశి సందర్బంగా హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సీఎం చంద్రబాబు పేరున ఎంపీ అర్చన చేయించారు. అనంతరం ఉట్లమానుకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ ని వేద పండితులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.