సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎం ఆర్ సీ లో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులకు గురువారం ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్య కమిటీ విధులు, బాధ్యతలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, బాలల హక్కులు, ఫోక్సో చట్టము, మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల తలెత్తుతున్న విపరీతపరిణామాలు, మత్తు పదార్థాల నుండి విద్యార్థుల సంరక్షణ, పాఠశాల పనితీరు, విద్యా విలువల అవగాహన కల్పించడం జరిగింది.