సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుకొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ సోమందేపల్లి మండల పరిధిలో జరిగిన సైబర్ నేరం, దొంగ బంగారం కేసులో 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఐదు బైకులు, రూ 21 లక్ష నగదు, ఐదు మోబైల్ ఫోన్లు, 2. 6 కేజీల దొంగ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.