సోమందేపల్లి: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తన వేరుశనగ పంపిణీ

52చూసినవారు
సోమందేపల్లి: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తన వేరుశనగ పంపిణీ
సోమందేపల్లి మండలంలో రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తన వేరుశనగను పంపిణీ చేస్తున్నట్లు ఎన్డీఏ కూటమ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని 10 గ్రామాలలో రైతు సేవా కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో విత్తన వేరుశనగ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, మండల కన్వీనర్ వెంకటేశులు, నాయకులు సిద్దలింగప్ప, సూరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్