పెనుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా స్కీం వర్కర్లపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈనెల 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు నాయకులు పాల్గొన్నారు.