పెనుగొండలో ప్రారంభమైన టిడిపి సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం

63చూసినవారు
పెనుగొండలో ప్రారంభమైన టిడిపి సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం
పెనుగొండ పట్టణంలో, హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ. 100 చెల్లించి సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని తెలిపారు. బీమా పరిహారం 2 లక్షల నుంచి 5 లక్షలుగా పెరిగింది. పార్టీ బలోపేతానికి గతంలో చేసిన నమోదు కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని పార్థసారథి పిలుపునిచ్చారు.