విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం సోమందేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని తెలిపారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు , పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పడి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.