గోరంట్ల ఎస్ఐ మంత్రి సవిత మాటే వేద వాక్యంగా అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూనే వుంటాం అంటే సహించేది లేదని మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ పెనుగొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఒక బడుగు బలహీన వర్గం ఎస్టీకి చెందిన వారు స్వచ్చందంగా గ్రామంలో వివాహ వేడుకను నిర్వహించే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వివాహ వేడుకకు హాజరైన వైసీపీ కార్యకర్తలపై ఆక్రమంగా కేసు నమోదు చేయాడన్ని ఖండించారు.