పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ మల్లికార్జున, అధికారులతో బుధవారం మంత్రి సవితమ్మ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉండకూడదని ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చేలా ప్రత్యేక స్కీం తయారు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తో సమావేశం నిర్వహించి ఉపాధి హామీ కూలీల సంఖ్య తో పాటు పని దినాలు పెంచాలని ఆదేశించారు.