శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం మొరసలపల్లిలో ఆదివారం దుండగులు మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గడ్డి కోయడానికి వెళ్లిన శాంతమ్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. గాయపడిన శాంతమ్మను 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.