Mar 24, 2025, 16:03 IST/
TG: కొత్త మంత్రి పదవులు వీరికి దక్కేనా?
Mar 24, 2025, 16:03 IST
ఉగాదిలోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో వీటిని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి కేటగిరీలుగా భర్తీ చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో జి.వివేక్, రెడ్డిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో అమర్ అలీఖాన్, బీసీ కోటాలో వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ లతోపాటు అదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.