Mar 26, 2025, 00:03 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడ: గుండెపోటుతో సొసైటీ వైస్ చైర్మన్ మృతి
Mar 26, 2025, 00:03 IST
బాన్సువాడ మండలం దేశాయిపేట్ ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ అంబర్ సింగ్ మంగళవారం రాంపూర్ తండాలో గుండెపోటుతో మృతి చెందారు. రైతుల కోసం ఆయన ఎంతో పనిచేశారు. తెలంగాణ రాంపూర్ తండాలో తాను పండించిన వడ్లను ఆరబెడుతుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే అంబర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడం తాండవాసులను కలచివేసింది.