ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ టీ. ఎస్. చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో సంబంధిత ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక మండల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాలకు నూరు మీటర్ల పరిధిలో వరకు 144 సెక్షన్ విధించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.