ధర్మవరంలోని కొత్తపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో గురువారం పాఠశాల పునఃప్రారంభ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు విద్యాసంబంధిత అనేక సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు.