శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ (న్యాషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ఫ్రారెక్ట్ ట్యాక్సెస్ ఆండ్ నార్కొటిక్స్) శిక్షణ కేంద్రంలో 74వ బ్యాచ్ ఐఆర్ఎస్ ఉద్యోగుల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన కి శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.