జిల్లా ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

58చూసినవారు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీజీ 155 జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత జాతికి మహాత్మా గాంధీజీ గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డీఎస్పీ విజయ్ కుమార్, ఎస్బి సి ఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, ఆర్ఐ వలి, పెనుగొండ సిఐ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్