పుట్టపర్తిలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి

70చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు దేశ స్వాంత్య్రానికి కృషిచేసిన సమరయోధుల పోరాటం అమరవీరుల త్యాగమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్