నల్లచెరువు తిరుమల పాదయాత్ర మహాయజ్ఞంకు మండల వ్యాప్తంగా ఉన్న హిందూ భక్త మహాశయులు తరలిరావాలని శ్రీ భావసార క్షత్రియ భజన మండలి పామిడి వారు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులతో వారు సమావేశమయ్యారు.సనాతన ధర్మ పరిరక్షణ చట్టం,హిందూ ధర్మ పరిరక్షణ సాధన కోసం గొప్ప దృఢ సంకల్పంతో దాదాపు 500 మంది పైచిలుకు భక్తులతో కలిసి ఇప్పటికీ 5 సార్లు పామిడి నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్లడం జరిగిందన్నారు.