నల్లమాడ: టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: మాజీ మంత్రి

70చూసినవారు
నల్లమాడ: టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ మండల కేంద్రంలోని షాదీ ఖానాలో మంగళవారం టీడీపీ కార్యకర్తలతో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోనే ఉంటేనే కార్యకర్తలకు తగిన గౌరవం లభిస్తుందన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్